పిన్న వయస్సులోనే జడ్జిగా హైదరాబాద్ యువతి
దేశంలోనే రెండో పిన్న వయస్కురాలైన జడ్జిగా స్వాతి పేరుగాంచింది. తెలంగాణ జుడీషియల్ సర్వీసెస్ పోటీ పరీక్షల్లో ద్వితీయ ర్యాంకు సాధించి... జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన స్వాతితో ఈటీవీ భారత్ ప్రత్యేక ఇంటర్వ్యూ...
లక్ష్యం ఎంతటి ఉన్నతమైనదైనా.... పక్కా ప్రణాళికతో కష్టపడితే గెలుపు సొంతం చేసుకోవచ్చునని నిరూపించింది... హైదరాబాద్ నగరానికి చెందిన 22 ఏళ్ల స్వాతి భవాని. తెలంగాణ జుడీషియల్ సర్వీసెస్ పోటీ పరీక్షల్లో ద్వితీయ ర్యాంకు సాధించి... జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైంది. దేశంలోనే రెండో పిన్న వయస్కురాలైన జడ్జిగా నిలవనున్న స్వాతి...అనుకున్నది సాధించేందుకు సినిమా ఇతర వినోదాలకు దూరంగా ఉండాల్సిన పనిలేదంటుంది. సమయపాలన పాటిస్తూ కష్టపడి చదివితే విజయం తప్పక దరి చేరుతోందంటోంది. త్వరలో జడ్జిగా సేవలందించనున్న స్వాతి భవానితో ఈటీవీ ముఖాముఖి.
- ఇదీ చూడండి: బోర్డు పునర్వ్యవస్థీకరణతో పట్టాలపైకి... రైల్వే!