ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మూడు రోజుల పసికందు మృతి చెందిందని ఆరోపిస్తూ బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన ప్రవీణ్‌గౌడ్ గర్భవతి అయిన తన భార్యను మూడు రోజుల క్రితం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆదివారం రాత్రి పాలు తాగిన కొద్దిసేపటికే ఆ చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. పరిస్థితి విషమించి మృతి చెందింది. ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించకపోవడం వల్లే పసికందు మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
'వైద్యుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి చనిపోయింది'
మూడు రోజుల పసికందు మృతి చెందిన విషాద ఘటన హైదరాబాద్ వనస్థలిపురంలో చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి చనిపోయిందంటూ బంధువులు ఆందోళన చేశారు.
'వైద్యుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి చనిపోయింది'