సినీ వర్ధమాన కథానాయిక శృతికఘోష్ (Shrutikaghosh) నగరంలో సందడి చేశారు. మాదాపూర్ హైటెక్ సిటీలోని హెచ్‌ఐసీసీ హోటల్‌లో ఏర్పాటు చేసిన సూత్రా (Sutra Fashion Life style Exibition) ఫ్యాషన్ లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్‌ను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శృతిక ఘోష్‌తో పాటు నగరానికి చెందిన పలువురు మోడల్స్ పాల్గొని తమ అందచందాలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన వస్త్రాభరణాల స్ఠాల్స్‌ను సందర్శిస్తూ... ఆభరణాలు, వస్త్రాలను ధరిస్తూ అభిమానులను అలరించారు.
శృతికఘోష్: సందడి చేసిన శృతికఘోష్... ఆకట్టుకున్న మోడల్స్ - Shrutika Ghosh launches Sutra Fashion Lifestyle Exhibition news
హైదరాబాద్ మాదాపూర్ హైటెక్ సిటీలోని హెచ్‌ఐసీసీ హోటల్‌లో ఏర్పాటు చేసిన సూత్రా ఫ్యాషన్ లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్‌ను వర్ధమాన కథానాయిక శృతికఘోష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శృతికఘోష్‌తో పాటు నగరానికి చెందిన పలువురు మోడల్స్ పాల్గొని తమ అందచందాలతో ఆకట్టుకున్నారు.

శృతికఘోష్
శృతికఘోష్
మూడు రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 200 మంది ప్రముఖ డిజైనర్లు రూపొందించిన విభిన్న రకాలైన వస్త్రాభరణాలను ప్రదర్శనలో ఏర్పాటు చేసినట్లు నిర్వహకులు తెలిపారు. ఇందులో యాక్సిసిరీస్ నుంచి మగువలకు కావల్సిన అభరణాలు, మోడ్రన్ దుస్తులు, చీరలు, రింగ్‌లు ఇలా అన్నీ రకాలైన ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: CM KCR: దళితబంధు ఓ పథకం కాదు.. ఉద్యమం: కేసీఆర్