తెలంగాణ

telangana

ETV Bharat / state

శాకంబరీ అలంకరణతో అమ్మవారి దర్శనం - శాకంబరీ అలంకరణతో అమ్మవారి దర్శనం

హైదరాబాద్ శృంగేరి జగద్గురు దేవస్థానం శంకరమఠంలో అమ్మ వారు శాకంబరీ అలంకరణతో దర్శనమిచ్చారు. పుష్య మాసంలో వచ్చే పౌర్ణమి రోజున విభిన్న కూరగాయలతో అలంకరించడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

శాకంబరీ అలంకరణతో అమ్మవారి దర్శనం
శాకంబరీ అలంకరణతో అమ్మవారి దర్శనం

By

Published : Jan 11, 2020, 6:27 AM IST

శాకంబరీ అలంకరణతో అమ్మవారి దర్శనం
పుష్య మాసాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ నల్లకుంటలోని శృంగేరి జగద్గురు శంకర మఠంలో శాకంబరీ అలంకరణతో అమ్మవారు దర్శనమిచ్చారు. విభిన్న రకాల కూరగాయలతో అమ్మవారిని అత్యంత ఆకర్షణీయంగా అలంకరించారు. ప్రతీ సంవత్సరం పుష్యమాసంలో వచ్చే పుష్య పౌర్ణమి రోజు.. భవాని అమ్మ వారిని ఇలా అలంకరించడం ఆనవాయితీగా వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచి అమ్మవారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. అనేక రకాల కూరగాయలతో అలంకరించిన రథంలో అమ్మవారిని ఏర్పాటు చేసి మఠం ఆవరణలో మంగళ వాయిద్యాల మధ్య ఊరేగించారు.

ABOUT THE AUTHOR

...view details