Secunderabad Cantonment Board Election cancelled: దేశంలోని అన్ని కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను రద్దు చేస్తూ.. కేంద్ర రక్షణ శాఖ గెజిట్ విడుదల చేసింది. దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్ కూడా రద్దైంది. ఫిబ్రవరి 17వ తేదీన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నిర్వహణకు రక్షణ శాఖ విడుదల చేసిన.. ఎలక్షన్లను రద్దు చేసింది. ఇటీవల కంటోన్మెంట్ బోర్డులను స్థానిక సంస్థల్లో కలుపుతారని.. రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది.
మధ్యలో ప్రత్యుత్తరాలు కూడా నడిచాయి. కానీ మధ్యలో ఎలక్షన్స్‌కి గెజిట్ ఇచ్చారు. మళ్లీ ఇవాళ వాటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక కంటోన్మెంట్ బోర్డులను స్థానిక సంస్థల్లో కలిపే అవకాశం ఎక్కువగా ఉందని సికింద్రాబాద్ కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులు చెబుతున్నారు. ఎలక్షన్ల రద్దును తాము స్వాగతీస్తున్నామని వెల్లడించారు.
అభ్యంతరాలు ఏమన్నా ఉంటే చెప్పొచ్చు: ఈనెల 24న దేశవ్యాప్తంగా 57 కంటోన్మెంట్లకు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల ప్రణాళికను రూపొందించిన బోర్డు.. అభ్యంతరాలు ఏమన్నా ఉంటే చెప్పాలని బోర్డు సీఈవో మధుకర్ నాయక్ కోరింది.