ఎస్‌బీఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాష్ మిశ్రాకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా, సర్కిల్ జనరల్ మేనేజర్ అజయ్‌కుమార్ సింగ్‌కు చీఫ్ జనరల్ మేనేజర్‌గా ఇద్దరు అధికారులకు ఇవాళ పదోన్నతి లభించింది. ఓం ప్రకాశ్ మిశ్రా 2019 మేలో భారతీయ స్టేట్ బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్‌గా వచ్చారు. మిశ్రా 1987లో పాట్నా సర్కిల్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఆయన వివిధ హోదాల్లో పనిచేసి బ్యాంకింగ్ రంగంలో గొప్ప అనుభవాన్ని పొందారు. మిశ్రా హైదరాబాద్‌కు రాక ముందు గౌహతి, దిల్లీ సర్కిల్ జనరల్ మేనేజర్‌గా పనిచేశారు.
ఎస్‌బీఐ సీజీఎం ఓం ప్రకాష్ మిశ్రాకు పదోన్నతి - ఓం ప్రకాష్ మిశ్రాకు పదోన్నతి
ఎస్‌బీఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాష్ మిశ్రాకు, సర్కిల్ జనరల్ మేనేజర్ అజయ్‌కుమార్ సింగ్‌కు పదోన్నతి లభించింది. ఓం ప్రకాష్ మిశ్రాకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

ఎస్‌బీఐ సీజీఎం ఓం ప్రకాష్ మిశ్రాకు పదోన్నతి
అదేవిధంగా అజయ్ కుమార్ సింగ్ 1991లో పాట్నా సర్కిల్ ప్రొబేషనరీ అధికారిగా బ్యాంక్‌లో చేరారు. హైదరాబాద్ రాక ముందు ముంబై కార్పొరేట్ సెంటర్, గౌహతి సర్కిల్‌లో వివిధ హోదాల్లో పని చేశారు.
ఇదీ చదవండి: నేడు, రేపు కొవిడ్ వ్యాక్సినేషన్ నిలిపివేత