ఆన్‌లైన్ తరగతుల పేరుతో ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయడం సరికాదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు, కళాశాలలను మూసి వేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు.
విద్యాసంస్థలను మూసివేయడం సరైన నిర్ణయమే: జగ్గారెడ్డి - ప్రైవేటు విద్యాసంస్థలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు
ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజలు కూడా ఇబ్బందుల్లోనే ఉంటారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు, కళాశాలలను మూసి వేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వమే ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజలు కూడా ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉంటారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజులు కట్టమని ఒత్తిడి చేయడం సరికాదని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారందరికి ప్రభుత్వం ఓ పరిష్కార మార్గం చూపించాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ పెట్టి మళ్ళీ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని..వైన్ షాపులు, బార్‌లు, సినిమా థియేటర్లను మూసివేయాలని కోరారు. తల్లిదండ్రులు చెల్లించిన ఫీజులో కనీసం సగమైనా తిరిగి పిల్లల తల్లిదండ్రులకు ఇప్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:విశ్వవిద్యాలయాల్లో బోధన ఖాళీలు త్వరలో భర్తీ: సబితా