తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రపంచకప్​లో భారత్, ఇంగ్లాండ్ జట్లే ఫేవరేట్స్

2019 వన్డే ప్రపంచకప్​ టోర్నీలో ఇంగ్లాండ్​, భారత్​ జట్లే ఫేవరేట్స్​ అని ఆసిస్​ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్​ అభిప్రాయపడ్డాడు.

రికీ పాంటింగ్

By

Published : Feb 10, 2019, 5:50 PM IST

భారత్, ఇంగ్లాండ్ జట్లే వచ్చే ప్రపంచకప్​లో ఫేవరేట్స్​ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాటింగ్ పేర్కొన్నాడు. గెలిచే అవకాశాలు ఆసీస్​కూ మెండుగానే ఉన్నాయని స్పష్టం చేశాడు. బాల్ టాంపరింగ్ వివాదంతో సస్పెండైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ రాకతో కంగారూ జట్టు బలపడటం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ప్రస్తుత ఫామ్​ని బట్టి చూస్తే భారత్, ఇంగ్లాండ్ జట్లు బలంగా ఉన్నాయని.. స్మిత్, వార్నర్ రాకతో ఆసీస్ కూడా బలపడుతుందని తెలిపాడు. వరుస ఓటములతో ఇబ్బంది పడుతోన్న ఆసీస్ త్వరలోనే గాడిన పడుతుందని కంగారూ జట్టుకు కొత్త అసిస్టెంట్ కోచ్​గా బాధ్యతలు చేపట్టిన పాంటింగ్ పేర్కొన్నాడు.
మార్చి 29తో స్మిత్, వార్నర్​పై సస్పెన్షన్ ముగియనుంది. పరిమిత ఓవర్ల క్రికెట్​లో సరైన ఆటగాళ్లు అందుబాటులో ఉంటే విజయావకాశాలు పెరుగుతాయని పాంటింగ్ భావిస్తున్నాడు. స్పిన్ బౌలింగ్​లో ఆడటానికి ఆసీస్ బ్యాట్స్​మెన్ ఇబ్బంది పడతారన్న విషయంపై స్పందిస్తూ.. ప్రస్తుత జట్టులో అలాంటి ఇబ్బందేమీ లేదని ఇంగ్లాండ్ గడ్డపై స్పిన్ ప్రభావం అంతంతమాత్రంగానే ఉంటుందని ఈ ఆసిస్​ మాజీ కెప్టెన్ తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details