తెలంగాణ

telangana

By

Published : Apr 12, 2020, 2:52 PM IST

ETV Bharat / state

'మరో 2 రోజుల్లో బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తి'

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు లబ్ధిదారులందరికీ రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసినట్లు పౌర సరఫరాల సంస్థ వెల్లడించింది. మరో రెండు రోజుల్లో పూర్థి స్థాయిలో పంపిణీ ప్రక్రియను ముగించనున్నట్లు ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

బియ్యం పంపిణీలో ఇబ్బందులు  రానివ్వబోం : పౌరసరఫరాల శాఖ
బియ్యం పంపిణీలో ఇబ్బందులు రానివ్వబోం : పౌరసరఫరాల శాఖ

రాష్ట్రంలో ఇప్పటి వరకు 88 శాతం మంది రేషన్ లబ్ధిదారులకు 12 కిలోల చొప్పున పంపిణీ చేసినట్లు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. మొత్తం మీద 3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 17 వేల రేషన్ దుకాణాల ద్వారా 76 లక్షల కార్డుదారులకు అందించినట్లు పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రేషన్ పోర్టబిలిటీ ద్వారా 13 లక్షల లావాదేవీలు జరిగినట్లు వివరించారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్​లో 2.42 లక్షలు, మేడ్చల్ జిల్లాలో 1.95 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 1.36 లక్షల మంది పోర్టబిలిటీ ద్వారా బియ్యం తీసుకున్నారన్నారు.

సాఫీగా బియ్యం పంపిణీ...

మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినట్లు కార్డుదారులందరికీ పంపిణీ ప్రక్రియ పూర్తవుతుందని శ్రీనివాస్‌ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. క్లిష్టమైన పరిస్థితుల్లో అత్యంత వేగంగా బియ్యం పంపిణీ చేసిన అధికారులకు, సిబ్బందికి, రేషన్ డీలర్లకు ఆయన అభినందనలు తెలిపారు. క్షేత్ర స్థాయిలో పౌరసరఫరాల శాఖ అధికారులు చాలా బాగా పనిచేశారని ప్రశంసించారు. త్వరలోనే సాంకేతిక సమస్యలను సైతం అధిగమిస్తామన్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బియ్యం పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివరించారు.

ఇవీ చూడండి : 'మర్కజ్​ కేసులతో అంచనాలన్నీ తారుమారయ్యాయి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details