Revanth Reddy Latest Comments on Dharani Portal : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.. ధరణిని రద్దు చేసి తీరతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతకంటే అత్యాధునిక విధానాన్ని తీసుకువచ్చి.. భూములకు రక్షణ కల్పిస్తామని వెల్లడించారు. ధరణి ఉన్నంత కాలం దళిత, గిరిజనుల భూములకు రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ తన దోపిడీకి వాడుకుంటున్నారని ఆరోపించారు. ధరణి వచ్చాక 35 లక్షల ఎకరాల దళిత, గిరిజన భూములను కొల్లగొట్టారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ దళారీగా మారి.. వేల మంది వీఆర్వోల పని ఆయనే చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
BJP Leader Venkatesam Joined in Congress: జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది వెంకటేశం(Layer Venkatesam) రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్ఎస్, బీజేపీల నుంచి మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు కేసీఆర్‌కు ఏటీఎంగా మారాయని.. తాజాగా ధరణిని కేసీఆర్ ఏటీఎంగా మార్చుకున్నారని ఆరోపించారు.
Revanthreddy on Dharani Portal : 'జులై 15 తర్వాత ధరణి అక్రమాలు బయటపెడతా'
Revanth Reddy Comments on Srinivas Goud: ఎన్ని రూ.వందల కోట్లు వచ్చాయో, ఎన్ని వందల ఎకరాలు ఆక్రమించుకున్నారో సీఎం లెక్కలు చూసుకుంటున్నారని విమర్శించారు. ధరణిని రద్దు చేస్తే రైతు బీమా, రైతుబంధు ఎలా వస్తుందని ప్రశ్నించడంలో అర్థం లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ చుట్టూ కేసీఆర్ కుటుంబం సుమారు పది వేల ఎకరాలు ఆక్రమించిందని ఆరోపించారు. ధరణి(Dharani Portal) తెచ్చింది 2020లో అయితే.. రైతుబంధు, రైతు బీమా 2018లో మొదలైందని గుర్తు చేశారు. కలెక్టర్లను అడ్డుపెట్టుకుని భూములు దోచుకుంటున్నారని మండిపడ్డారు. దోపిడీని ప్రశ్నిస్తే.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీసీ కార్డును ముందు పెడుతున్నారని ఆరోపించారు. ధరణి నిర్వహిస్తున్న సంస్థలో పెట్టుబడి పెట్టిన వారు ఆర్థిక నేరగాళ్లని.. అందులో విదేశీయుల భాగస్వామ్యం ఉందని గతంలో రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలుచేశారు.