తెలుగు సాహిత్య అక్షర పురుషుడు శ్రీ రావూరి భరద్వాజ జయంతి సందర్భంగా... తెలుగు ప్రజలందరికీ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ శుభాకాంక్షలు తెలియజేశారు. రావూరి భరద్వాజ స్మరించుకోవడమంటే తెలుగు భాషను గౌరవించుకోవడమేనని ఆయన పేర్కొన్నారు. మనం ఎంత గొప్ప చదువులు చదువుకున్నప్పటికీ మాతృ భాషను మరిచిపోవద్దని... మాతృ భాషను మరచిపోతే కన్నతల్లిని మరచిపోయినట్లేనన్నారు.
ఆయన్ను స్మరించుకుంటే మన భాషను గుర్తుచేసుకున్నట్టే: దత్తాత్రేయ - ravuri bharadwaja yanthi latest news
ప్రముఖ సాహిత్యకారుడు జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సాహిత్య రంగంలో ఆయనో వటవృక్షం లాంటివారని దత్తాత్రేయ గుర్తుచేసుకున్నారు.

భరద్వాజ సామాన్య ప్రజల స్థితిగతుల మీదనే ఎక్కువ రచనలు చేశారని... 1983 లో సాహిత్య అకాడమీ పురస్కారం లభించిందని తెలిపారు. ఆకాశవాణిలో ఎంతో ప్రఖ్యాతి గాంచిన "బాలానందం" కార్యక్రమం రావూరి రూపకల్పనే అని దత్తాత్రేయ గుర్తుచేసుకున్నారు. "పాకుడురాళ్లు" పుస్తకం ద్వారా ఆయనకు జ్ఞానపీఠ్ పురస్కారం లభించిందని... తెలుగు సాహిత్య రంగంలో వారు ఒక వటవృక్షం లాంటివారని కొనియాడారు. భరద్వాజ రచనలు చలన చిత్ర రంగానికి ఒక మైలు రాయిగా నిలిచాయని బండారు దత్తాత్రేయ కొనియాడారు.
ఇవీ చూడండి:కరోనా చికిత్సపై భయం... నమ్మకం పెంచే పనిలో ప్రభుత్వం