తెలంగాణ

telangana

ETV Bharat / state

Current Wires: నేలకూలిన విద్యుత్ స్తంభం.. ఆందోళనలో స్థానికులు.. - Current Wires: నేలకూలిన విద్యుత్ స్తంభం.. హైటెన్షన్ తీగలతో పొంచి ఉన్న ప్రమాదం

హైదరాబాద్ ఇందిరానగర్​ కాలనీలో విద్యుత్​ స్తంభం నేలకూలి తీగలు వేలాడుతున్నాయి. మరో స్తంభమూ కూలే పరిస్థితుల్లో ఉంది. స్థానికులు ఆందోళన చెందుతున్నా... అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు.

power pole collapsed in indiranagar colony, danger ahead with high tension wires
నేలకూలిన విద్యుత్ స్తంభం.. హైటెన్షన్ తీగలతో పొంచి ఉన్న ప్రమాదం

By

Published : Jun 18, 2021, 12:40 PM IST

హైదరాబాద్​ మల్లెపల్లి ఇందిరానగర్​లో విద్యుత్​ స్తంభం నేలకూలింది. హైటెన్షన్​ విద్యుత్​ తీగలు వేలాడుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే కాలనీలో మరో విద్యుత్​ స్తంభమూ కూలే పరిస్థితుల్లో ఉంది. ఒక పక్కకు ఒరిగి.. రేపో, మాపో కూలేలా ఉందని కాలనీవాసులు అంటున్నారు.

జనావాసాల్లో విద్యుత్​ తీగలు ఇలా నేలపై వేలాడితే ప్రమాదమని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి వైర్లను తొలగించాలని కోరుతున్నారు. కాలం చెల్లిన స్తంభాలను మార్చాలని వేడుకుంటున్నారు. పెను ప్రమాదం జరగకముందే అధికారులు చర్యలు చేపట్టాలని అంటున్నారు. చేతులు కాలాకా.. ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదని చెబుతున్నారు.

ఇదీ చూడండి:రోజు విడిచి రోజు నీరు.. నేటి నుంచి సరఫరా

ABOUT THE AUTHOR

...view details