తెలంగాణ

telangana

ETV Bharat / state

Extra Power charges: వినియోగదారులకు విద్యుత్ షాక్‌.. రెండింతల బిల్లు వచ్చిందని ఆవేదన - సర్వీస్ ఛార్జీలు, ఫిక్స్‌డ్ ఛార్జీల భారం

Extra Power charges: సాధారణంగా కరెంట్‌ను ముట్టుకుంటే షాక్ కొడుతుంది. కానీ ఈనెలలో కరెంట్ బిల్లు చూస్తేనే వినియోగదారులు షాక్‌కు గురవుతున్నారు. గత నెలతో పోల్చితే.. దాదాపు రెండింతల బిల్లు వచ్చిందని ఆందోళన చెందుతున్నారు. గత నెలలో పెంచిన విద్యుత్ ఛార్జీలు మే నెల నుంచి అమల్లోకి వచ్చాయి. ఇందుకు తోడూ అదనంగా సర్వీస్ ఛార్జీలు, ఫిక్స్‌డ్ ఛార్జీలను వేస్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Extra Power charges
Extra Power charges

By

Published : May 13, 2022, 5:08 AM IST

Updated : May 13, 2022, 5:30 AM IST

Extra Power charges: మే నెలలో ఒక్కసారిగా భారీగా పెరిగిన విద్యుత్‌ బిల్లులను చూసి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఐదేళ్ల విరామం తర్వాత రాష్ట్రంలో ఏప్రిల్‌ 1 నుంచి ఛార్జీల పెంపు అమల్లోకి వచ్చాయి. ఏప్రిల్‌ వాడకానికి సంబంధించిన బిల్లులను డిస్కంలు ప్రస్తుత మే నెలలో జారీ చేస్తున్నాయి. దీంతో విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రభావం కనిపిస్తోంది. నెలకు 50 యూనిట్లు, 100 యూనిట్లు, 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే వినియోగదారుల బిల్లులు భారం ఎక్కువగా కనిపిస్తోంది. 200 యూనిట్లు, ఆపై విద్యుత్‌ వినియోగించే ఎగువ మధ్యతరగతి, ధనిక వర్గాల విద్యుత్‌ బిల్లులూ పెరిగినా.. అది కేవలం 15 శాతం మాత్రమే ఉన్నట్లు వినియోగదారులు చెబుతున్నారు.

విద్యుత్‌ చార్జీల పెంపుతో పాటు కస్టమర్‌ చార్జీలూ పెంచడం, గృహాలపై తొలిసారిగా ఫిక్స్‌డ్‌ ఛార్జీలు విధించడంతో మే నెల బిల్లుల భారం పెరిగింది. వినియోగదారుల సర్వీసు ఛార్జీలను డిస్కంలు రెండితలు చేశాయి. గతంలో 50 యూనిట్లలోపు కరెంట్ వినియోగించేందుకు డిస్కంలు 20 ఛార్జీగా విధిస్తే.. ఇప్పుడు 40 రూపాయలు చేసింది. 50 యూనిట్ల నుంచి 100 యూనిట్లలోపు 40 ఉంటే 70 రూపాయలకు పెంచేసింది. 100 నుంచి 200 యూనిట్లకు 50 నుంచి 90 రూపాయలుగా నిర్ణయించారు. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర ధర పెరుగుదలతో అల్లాడుతున్న తమపై విద్యుత్‌ ఛార్జీల భారం పడిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

వినియోగదారులకు విద్యుత్ షాక్‌.. రెండింతల బిల్లు వచ్చిందని ఆవేదన

సాధారణంగానే ఏప్రిల్, మేలో కరెంట్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు పెరిగిన ఛార్జీలు అమల్లోకి రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మార్చితో పోల్చితే ఏప్రిల్‌లో ఎండల తీవ్రత పెరగడంతో గృహాల్లో విద్యుత్‌ వాడకం బాగా పెరిగిపోయింది. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు 24 గంటలు వాడుతున్నారు. రోజువారీ పనిచేసుకుని బతికే కూలీలు, దిగువమధ్యతరగతి కుటుంబాల వారు పెరిగిన పెరిగిన కరెంట్‌ ఛార్జీలు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ మహానగరం విస్తరిస్తుండటంతో ఏటా విద్యుత్ వినియోగదారులు పెరిగిపోతున్నారు. సాధారణంగా ఒక సంవత్సరంలో గ్రేటర్ పరిధిలో రెండు లక్షల విద్యుత్ కనెక్షన్లు తీసుకుంటే ఈ ఏడాది 6లక్షల కనెక్షన్లు ఇచ్చనట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి:రానున్న రోజుల్లో మెడికల్​ హబ్​గా తెలంగాణ..: సబితాఇంద్రారెడ్డి

'మూడోసారీ నేనే ప్రధాని'... క్లారిటీ ఇచ్చిన మోదీ!

Last Updated : May 13, 2022, 5:30 AM IST

ABOUT THE AUTHOR

...view details