రాజధాని నగరానికే కాకుండా జిల్లాల్లోని మురికివాడలనూ కరోనా తీవ్రంగా భయాందోళనకు గురిచేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ ఎంబీ భవన్లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.వెంకట్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న అంశాలపై చర్చించిన రాష్ట్ర కార్యవర్గం పలు తీర్మానాలను ఆమోదించింది.
అందువల్ల కరోనా బారిన పడుతున్నారు...
చిన్న గదులు, పూరిగుడిసెలు, అద్దె ఇల్లు, మురికివాడల్లో ఉంటున్న పేదలు సొంత ఇళ్లల్లో క్వారంటైన్లో ఉండటం సాధ్యం కాకపోవడంతో కుటుంబం అంతా కరోనా బారిన పడుతుతోందని పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. గ్రామాలు, మురికివాడల్లో కరోనా పరీక్షలు నిర్వహించి ఇళ్లల్లో ఐసోలేషన్ సౌకర్యాలు లేని ప్రజలందరికీ ప్రభుత్వమే క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భోజన వసతి సహా ఇతర వసతులన్నీ కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రభుత్వాన్ని కోరింది.
కేంద్రంపై ఒత్తిడి తేవాలి...