సీజనల్ వ్యాధులతో హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరగడం వల్ల ప్రభుత్వం ఆస్పత్రిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆస్పత్రికి వచ్చే రోగులకు అవసరమైన చికిత్సలు అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిని సందర్శించిన ఆయన... చికిత్సపొందుతున్న పలువురు రోగులను పరామర్శించారు. ఆస్పత్రిలోని పాత నిర్మాణాలను కూల్చివేసి త్వరలోనే ఓపీ విభాగం కోసం ప్రత్యేకంగా భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. గత నెలలో 51 వేల మంది రోగులు ఫీవర్ ఆస్పత్రికి రాగా అందులో కేవలం 61 డెంగ్యూ కేసులు నమోదైనట్లు ఈటల వెల్లడించారు.
పాత నిర్మాణలు కూల్చివేసి కొత్త భవనం: ఈటల
హైదరాబాద్లోని నల్లకుంట ఆస్పత్రిలో పాత నిర్మాణాలను కూల్చివేసి త్వరలోనే ఓపీ విభాగం కోసం కొత్త భవనాన్ని నిర్మిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఫీవర్ ఆస్పత్రిని సందర్శించారు.
పరామర్శిస్తున్న మంత్రి