కోవిడ్ చికిత్స అనంతరం ఇంటివద్ద ఆక్సిజన్ అవసరం ఉండే వారి కోసం ఓలా ఉచితంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందించనుంది. కాన్సన్ట్రేటర్లు అవసరమయ్యే వారు ఓలా యాప్ ద్వారా పొందే అవకాశాన్ని కల్పించారు. ఇప్పటికే బెంగళూరులో ఈ సౌకర్యాన్ని కల్పించిన ఓలా సంస్థ... తాజాగా హైదరాబాద్‌లోనూ సేవలను ప్రారంభించింది.
Corona: ఉచితంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందించనున్న ఓలా
కరోనా విపత్తు వేళ సాయం అందించేందుకు ఓలా సంస్థ ముందుకొచ్చింది. ఆక్సిజన్ అవసరమున్న వారికి ఉచితంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందిస్తోంది. ఓలా యాప్ ద్వారా విజ్ఞప్తి పంపితే ఇంటికే వాటిని చేర్చనుంది.
ఉచితంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందించనున్న ఓలా
500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను నగరంలోని ఐదు ప్రాంతాల్లో అందుబాటులో ఉంచి... విజ్ఞప్తి వచ్చిన వెంటనే అవసరమైన వారికి చేరుస్తారు. బీఆర్కే భవన్లో జరిగిన కార్యక్రమంలో ఓలా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు.
ఇదీ చదవండి :భూముల సమగ్ర సర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
TAGGED:
oxygen concentrators