పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు సమీపంలోని కాపర్ డ్యామ్ వద్ద చిక్కుకున్న 31 మంది మత్స్యకారులను రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ రంగంలోకి దిగింది. గోదావరి ప్రవాహం ఎక్కువుగా ఉండటం వల్ల రెండు పడవలు బోల్తా పడ్డాయి. బాధితులు ఈత కొట్టుకుంటూ వెళ్లి కాపర్ డ్యామ్ ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారు. వారిని కాపాడేందుకు పోలవరం నుంచి పోలీసు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు బయలుదేరాయి.
పడవలు బోల్తా... చిక్కుకున్న మత్స్యకారులు
పోలవరం ప్రాంతంలోని గోదావరిలో 31 మందితో వెళ్లిన మత్య్సకారుల బోటు బోల్తా పడింది. వారందరూ...ఎగువ కాపర్ డ్యామ్ వద్ద చిక్కుకుపోయారు. పోలీసు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి.
పడవలు బోల్తా... మత్స్యకారుల రక్షణకు చర్యలు
నేరుగా వెళ్లేందుకు దారి లేనందున.. సహాయకబృందాలు తూర్పుగోదావరి జిల్లా నుంచి కాపర్ డ్యామ్ చేరుకోనున్నాయి. మత్య్సకారులంతా ధవళేశ్వరంకు చెందిన వారు. వీరంతా 80 రోజుల క్రితం 18 మరబోట్లలో చేపలవేటకు వెళ్లారు. ప్రవాహాం ఎక్కువవుతోందని 10 రోజులక్రితం తిరుగు పయనమయ్యారు. ఇవాళ ఉదయం రెండు బోట్లు ప్రమాదానికి గురైయ్యాయి.
ఇవీ చదవండి...వరద సహాయక చర్యల్లో పడవ బోల్తా