తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కేసుల సంఖ్యను సక్రమంగా చెప్పడం లేదు: ఎంపీ రేవంత్​రెడ్డి - ప్రభుత్వంపై రేవంత్​ ఫైర్

రాష్ట్రంలో కరోనా కేసులకు సంబంధించి హెల్త్​ బులిటెన్​కు వాస్తవాలకు దాదాపు 3వేల కేసుల తేడా ఉందని ఉందని ఆరోపించారు మాల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి. వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టమైన లెక్కలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Mp revanth reddy on corona health bulletin
కరోనా కేసుల సంఖ్యను సక్రమంగా చెప్పడం లేదు: రేవంత్​రెడ్డి

By

Published : Jul 4, 2020, 5:21 AM IST

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యను ప్రభుత్వం సక్రమంగా చూపడం లేదని ఎంపీ రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గురువారం మొత్తం కేసులు 18,570 అని హెల్త్ బులిటెన్​లో చూపించారని... అదే లైవ్‌ డ్యాష్​ బోర్డులో మాత్రం 21,393 అని చూపిస్తోందని ఆరోపించారు. హెల్త్ బులిటెన్​కి వాస్తవాలకు దాదాపు 3,000 కేసుల తేడా ఉందని పేర్కొన్నారు. కరోనా కేసుల సంఖ్య విషయంలో ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటున్నారని తెలిపారు. మంత్రి ఈటల రాజేందర్ వాస్తవ లెక్కలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details