తెలంగాణ

telangana

ETV Bharat / state

యువ ఇంజినీర్​ మానస రెడ్డికి ఎమ్మెల్సీ కవిత అభినందనలు

చిన్న వయసులోనే ఎంతో వినూత్నంగా ఆలోచించి కాంక్రీట్​ పైపులో ఇల్లు నిర్మించిన మానస రెడ్డిని ఎమ్మెల్సీ కవిత అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని నూతన ఆవిష్కరణలు చేయాలని ఆకాంక్షించారు. హైదరాబాద్​లోని తన నివాసంలో కవితను మానసారెడ్డి కలిశారు.

mlc kavitha, manasa reddy, house in concrete pipe
మానస రెడ్డి, ఎమ్మెల్సీ కవిత

By

Published : Apr 13, 2021, 9:57 AM IST

తెరాస ప్రభుత్వం నూతన ఆవిష్కరణలకు అండగా నిలుస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తక్కువ ఖర్చుతో సిమెంట్‌ పైపుల్లో ఇళ్లను నిర్మిస్తోన్న యువ ఇంజినీర్ పేరాల మానస రెడ్డిని కవిత అభినందించారు. మానస రెడ్డి భవిష్యత్తులో మరిన్ని నూతన ఆవిష్కరణలతో రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని ఆమె ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో కవితను కలిసిన మానస రెడ్డి కొత్త పద్ధతిలో ఇళ్లను నిర్మిస్తున్న విధానాన్ని వివరించారు.

కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్‌ గ్రామానికి చెందిన పేరాల మానస రెడ్డి తెలంగాణ గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో ప్రాథమిక విద్యాభాసం పూర్తి చేసింది. సివిల్ ఇంజనీరింగ్​లో గ్రాడ్యుయేషన్ పొందిన అనంతరం వివిధ దేశాల్లో అక్కడి వాతావరణానికి అనుగుణంగా, తక్కువ ఖర్చుతో ఇండ్లను నిర్మిస్తున్న విధానాలను అధ్యయనం చేసింది. వాటి ఆధారంగా మన ప్రాంతంలోనూ తక్కువ ఖర్చుతో ఇంటి డైజన్లను రూపొందించింది.

కేవలం 15 రోజుల్లో..

రెండు వేల మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన కాంక్రీట్‌ పైపు(తూము)లో 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓపాడ్స్‌ లేదా మైక్రో ఇళ్లుగా పిలిచే ఇల్లును నిర్మించి ఔరా అనిపిస్తోంది. ఇండియాలోనే తొలిసారి నిర్మించే ఈ ఓపాడ్‌ ఇళ్లు 40 నుంచి 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో 15 రోజుల్లో నివసించడానికి వీలుగా తయారవుతుందని తెలిపింది.

కాంక్రీట్​ పైపులో మానస రెడ్డి నిర్మించిన ఇల్లు

ఇదీ చదవండి:సీఎం ఎన్నికల ప్రచార సభ ఆపాలని రైతుల పిటిషన్‌

ABOUT THE AUTHOR

...view details