అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సాహిత్రెడ్డి కుటుంబాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పరామర్శించారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని అన్నారు. సాహిత్ తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు.
'సాహిత్రెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం' - సాహిత్రెడ్డి కుటుంబానికి పరామర్శ
సాహిత్రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసానిచ్చారు. అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

తలసాని శ్రీనివాస్
సాహిత్రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి తలసాని శ్రీనివాస్
ఇదీ చూడండి : అమెరికాలో రోడ్డు ప్రమాదం... హైదరాబాదీ దుర్మరణం..