తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశంలోనే అధిక వేతనాలు ఇస్తున్న ఘనత మనదే: శ్రీనివాస్​ గౌడ్​

30శాతం పీఆర్సీ ప్రకటించి ఉద్యోగులపై తనకున్న ప్రేమను సీఎం కేసీఆర్​ చాటుకున్నారని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ పేర్కొన్నారు. లాక్​డౌన్​తో ఆర్థిక నష్టాలు ఉన్నా సీఎం వెనక్కి తగ్గలేదని వెల్లడించారు. ఉద్యోగులందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు.

minister srinivas goud
మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

By

Published : Mar 25, 2021, 1:36 PM IST

పీఆర్సీ నివేదిక ప్రకారం 7.5శాతమే వేతనాలు పెంచాలని ఉన్నప్పటికీ.. 30శాతం పీఆర్సీ ప్రకటించి ఉద్యోగుల పట్ల తనకున్న ప్రేమను సీఎం కేసీఆర్​ చాటుకున్నారని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ వెల్లడించారు. దేశంలోనే అధికంగా వేతనాలు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్​లో నూతనంగా నియామకమైన 60మందికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎస్ సోమేశ్ కుమార్ నియామక పత్రాలు అందించారు. ఇప్పుడున్న 63మంది సిబ్బందికి మరో 60 మంది చేరడం వల్ల బెవరేజెస్ కార్పొరేషన్​కు ఎంతో లబ్ధి చేకూరుతుందని శ్రీనివాస్​ గౌడ్​ అభిప్రాయపడ్డారు.

ఆర్థిక లోటు ఉన్నా..

ఆరున్నరేళ్ల వ్యవధిలోనే 73 శాతం వేతనాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు. లాక్​డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ఉద్యోగులకు జీతాలు పెంచిందని అన్నారు. ఉద్యోగులు నిబద్ధతతో, బాధ్యతాయుతంగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు.

ఉద్యోగులందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలి: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

ఇదీ చదవండి:తెలంగాణలో కొత్తగా 18 డయాగ్నస్టిక్‌ సెంటర్లు: మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details