శిల్పారామానికి పోటెత్తిన సందర్శకులు
హైదరాబాద్ ఉప్పల్లో మూసీ ఒడ్డున నిర్మితమైన శిల్పారామం పిల్లలు, పెద్దలతో కళకళలాడింది. ఆదివారం కావడం వల్ల భారీ సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు.
శిల్పారామానికి పోటెత్తిన సందర్శకులు
భాగ్యనగరంలో మూసీ నది ఒడ్డున మానవ నిర్మిత కళాఖండం జనసంద్రంగా మారింది. వారాంతం కావడం వాతావరణం ఆహ్లాదంగా ఉండడం వల్ల పెద్ద సంఖ్యలో నగర వాసులు శిల్పారామ సందర్శనకు తరలివచ్చారు. పకృతి రమణీయతను స్వీయచిత్రాల్లో భద్రపర్చుకున్నారు. గ్రామీణ సంప్రదాయ కళాకృతులు ఆకట్టుకున్నాయి. కూచిపూడి నృత్యరూపకం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది.