తెలంగాణ

telangana

By

Published : Sep 7, 2020, 5:28 PM IST

ETV Bharat / state

ప్రజలపై ఎల్​ఆర్​ఎస్ భారం దారుణం : సీపీఎం నేత నాగయ్య

ల్యాండ్ రెగులరైజేషన్ స్కీమ్​పై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 131ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర కమిటీ ధర్నాకు దిగింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్​లో పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నేతలు నిరసన తెలిపారు.

ఉపాధి కోల్పోతున్న ప్రజలపై ఎల్​ఆర్​ఎస్ భారం దారుణం : సీపీఎం నేత నాగయ్య
ఉపాధి కోల్పోతున్న ప్రజలపై ఎల్​ఆర్​ఎస్ భారం దారుణం : సీపీఎం నేత నాగయ్య

ఎల్ఆర్ఎస్​పై జీవో 131ను తక్షణమే ఉపసంహరించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. కరోనా మహమ్మారితో ప్రజలు ఉపాధి కోల్పోయి తిండిలేక పస్తులు ఉంటే ప్రభుత్వం ప్రజల నెత్తిపై ఎల్ఆర్ఎస్ భారం మోపడం దారుణమని కమిటీ తీవ్రంగా మండిపడింది. సుమారు 70, 80 ఏళ్ల నుంచి నివాసముంటున్న స్థలాలను కూడా క్రమబద్ధీకరించుకోవాలంటూ ఆదేశాలు జారీ చేయడం అనైతికమని సీపీఎం నేత జి.నాగయ్య పేర్కొన్నారు.

ఉపాధి కోల్పోతున్న ప్రజలపై ఎల్​ఆర్​ఎస్ భారం దారుణం : సీపీఎం నేత నాగయ్య

ఆ తరగతుల వారిపై భారం..

ఈ దుశ్చర్య పేద, మధ్య తరగతి ప్రజలపై పెను భారం మోపడమేనని నాగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు కరోనా కట్టిడి చర్యలను గాలికి వదిలేసి.. మరోవైపు ప్రజా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉపాధి కోల్పోతున్న ప్రజలపై ఎల్​ఆర్​ఎస్ భారం దారుణం : సీపీఎం నేత నాగయ్య

పూర్వీకుల నాటి నివాసాలపై..

తాతల కాలం నాటి ఇళ్లను సైతం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని లేని పక్షంలో మంచినీటి, డ్రైనేజీ కనెక్షన్ తొలగిస్తామని ప్రభుత్వం హెచ్చరించడం దేనికి సంకేతమని నాగయ్య ప్రశ్నించారు.

ఉపాధి కోల్పోతున్న ప్రజలపై ఎల్​ఆర్​ఎస్ భారం దారుణం : సీపీఎం నేత నాగయ్య

ఇవీ చూడండి : దుబ్బాక తహసీల్దార్​ కారుకు అడ్డంగా పడుకొని నిరసన..

ABOUT THE AUTHOR

...view details