తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ ఏడాది ఖైరతాబాద్​ వినాయకుడు ఎత్తు ఒక్క అడుగే!

khairatabad-ganesh-idol-statue-height-reduce-to-1-feet-this-year
ఈ ఏడాది ఖైరతాబాద్​ వినాయకుడు ఎత్తు ఒక్క అడుగే!

By

Published : May 12, 2020, 3:47 PM IST

Updated : May 12, 2020, 6:20 PM IST

15:40 May 12

ఈ ఏడాది ఖైరతాబాద్​ వినాయకుడు ఒక్క అడుగే!

ఈ ఏడాది ఖైరతాబాద్​ వినాయకుడు ఒక్క అడుగే!

రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్​ వినాయకుని విగ్రహం ఈ ఏడాది ఒక్క అడుగు ఎత్తులోనే ఏర్పాటు చేయనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఖైరతాబాద్ వినాయకుని ఎత్తు విషయంలో ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18న నిర్వహించాల్సిన కర్ర పూజ కార్యక్రమాన్ని కమిటీ రద్దు చేసినట్లు ప్రకటించింది.  

1954 నుంచి ఆరున్నర దశాబ్దాలుగా భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న ఖైరతాబాద్ గణేశుడి భారీ విగ్రహాన్ని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విరమించుకున్నట్లు కమిటీ కన్వినర్ సందీప్ తెలిపారు. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చేంతవరకు ఖైరతాబాద్ గణేశుడి ఉత్సవాలను నిరాడంబరంగా జరపనున్నట్లు సందీప్ పేర్కొన్నారు.

Last Updated : May 12, 2020, 6:20 PM IST

ABOUT THE AUTHOR

...view details