మత్స్య కార్మిక సంఘం నగర అధ్యక్షురాలు, హైదరాబాద్ మత్స్య సొసైటీ డైరెక్టర్ కన్నం తులసి గంగపుత్ర అకాల మరణం... మత్స్యకారులకు తీరని లోటని వృత్తి సంఘాల రాష్ట్ర నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు దశాబ్దాలుగా మత్స్యకారుల కోసం ఎన్నో పోరాటాలు చేశారని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
వారసిగూడ చౌరస్తాలోని తులసి స్వగృహంలోని భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మత్స్యకారులను ఐక్యం చేయటంలో తులసి కీలక పాత్ర పోషించారని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు.