తెలంగాణ

telangana

ETV Bharat / state

కాళేశ్వరం విద్యుత్ బకాయి బిల్లులు రూ. 273.63 కోట్లు - rampoor

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా పంపుసెట్లకు అయిన విద్యుత్ బిల్లు బకాయిలు  రూ.273.63 కోట్లు. రాయితీ రూపంలో ప్రభుత్వం ఉత్తర విద్యుత్​ పంపిణీ సంస్థకు చెల్లించాల్సి ఉంది. ఎన్పీడీసీఎల్ వైబ్​సైట్లో ఈ వివరాలు లభ్యమయ్యాయి.

కాళేశ్వరం విద్యుత్ బకాయి బిల్లు రూ. 273.63 కోట్లు

By

Published : Sep 13, 2019, 5:45 AM IST

తెలంగాణ ప్రాంత జలప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఆగస్టు నెలకు రూ. 237.63 కోట్ల విద్యుత్తు బిల్లు బకాయిలు ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్సీడీసీఎల్)కు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈమేరకు ఎన్సీడీసీఎల్ వెబ్​సైట్​లో వివరాలు లభ్యమయ్యాయి. రాష్ట్రంలో సుమారు కోటి ఎకరాలను సాగులోకి తేవాలన్న సంకల్పంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు భారీ పంపుసెట్లకు విద్యుత్ సరఫరా చేస్తోంది. ఈ మేరకు కన్నెపల్లి, సుందిళ్ల, అన్నారం పంపుహౌస్, నందిమేడారం, రామడుగు, రాజేశ్వర్ రావు పేట , రాంపూర్ ప్రాంతాల్లో ఎన్పీడీసీఎల్ కాళేశ్వరం ప్రాజెక్టు పంపుసెట్లకు సంస్థ హెచ్​టీ సర్వీసులను మంజూరు చేసింది. ఆగస్టు చివరి వరకు ఏడు చోట్ల ఏర్పాటు చేసిన పంపుసెట్ల వద్ద విద్యుత్ వినియోగం రూ.237.63కోట్ల మేర బిల్లు రీడింగ్ నమోదైంది.

కాళేశ్వరం విద్యుత్ బకాయి బిల్లు రూ. 273.63 కోట్లు

ABOUT THE AUTHOR

...view details