తెలంగాణ

telangana

ETV Bharat / state

KA Paul Comments: 'నేను ఎంత ఏడ్వాలో అంత ఏడుస్తున్నాను లోపల'

KA Paul Comments: దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయం పెరిగినా... అదే స్థాయిలో అప్పు కూడా పెరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశం బాగు కోరే ప్రతి ఒక్కరూ తన పార్టీలో చేరాలని కోరారు.

KA Paul
KA Paul

By

Published : May 17, 2022, 7:23 PM IST

Updated : May 17, 2022, 10:22 PM IST

KA Paul Comments: 'నేను ఎంత ఏడ్వాలో అంత ఏడుస్తున్నాను లోపల'

KA Paul Comments: ప్రజాశాంతి పార్టీ ఆధ్వర్యంలో రేపు నిర్వహించే సమావేశాన్ని అధికార పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఆరోపించారు. హైదరాబాద్ బేగంపేట ప్రకాశ్​నగర్‌లోని చికోటీ గార్డెన్స్‌లో లీడర్లు పాస్టర్లు, బిషప్‌లో సమావేశం జరిగి తీరుతుందన్నారు. సమావేశంలో పాల్గొంటానని పాస్టర్లు, లీడర్లు, బిషప్‌లు ఏమి భయపడవద్దని అన్నారు. అరెస్ట్‌ చేస్తారా చేసుకొండి... అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించారు. తెలంగాణలో రాక్షస పాలన జరుగుతుందని అనడానికి ఇదే సాక్ష్యమన్నారు.

మొన్న సిరిసిల్లలో తనపై దాడి చేశారని... ఇవాళ సమావేశాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని కేఏ పాల్ మండిపడ్డారు. ఓటు, నోటు కేసులో దోషి అయిన మత్తయి అనే వ్యక్తి 200 మందితో మా సమావేశాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడన్నారు. సమావేశాన్ని అడ్డుకోవడానిక ఆయన తీవ్రంగా ఖండించారు. దేశంలో రాష్ట్రాల పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ అన్నారు. ఈ అంశంపై దిల్లీలో మూడు రోజుల పాటు 26 సమావేశాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. దేశం పరిస్థితి ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. తన గురించి తెలుసు కాబట్టే మీడియా ఇంతలా ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్​షాతో భేటీ అయి అనేక విషయాలను చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా దేశంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నట్లు వివరించారు. తెలంగాణ, యూపీలో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. తెలంగాణలో ప్రతి ఒక్కరూ ఒక్కో పార్టీ పెట్టి ఓట్లు చీలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ బాగుకోరే ప్రతి ఒక్కరూ తన పార్టీలో చేరాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో చిన్నస్థాయిలో లీడర్లు సైతం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన పాల్... దిల్లీలో మాత్రం కేంద్రమంత్రులు, రాజకీయ ఉద్దండులు తనతో కలిసి నడవడానికి మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు.

దేశ ఆదాయం ఎంతుందో... అదేస్థాయిలో అప్పు కూడా ఉంది. ఇక రాష్ట్రాల అప్పుతో పోలిస్తే ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. ఈ పరిస్థితిని అర్థం చేసుకోరా? అందుకే గడిచిన 35 రోజుల్లో 125 మంది అపర జ్ఞానులు మా పార్టీలో చేరారు. నేను ఎంత బాధపడాలో అంత బాధపడుతున్నాను... నేను ఎంత ఏడ్వాలో అంత ఏడుస్తున్నాను లోపల. ఎంత ప్రార్థించాలో అంత ప్రార్థిస్తున్నాను. ఎంత ప్రయత్నించాలో అంత ప్రయత్నిస్తున్నాను. ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నాను. ఎందుకంటే ఈ రెండు సంవత్సరాల్లో మనం దేశాన్ని కాపాడకపోతే పరిస్థితి చేజారిపోతుంది. మీ ఆదాయం లక్ష రూపాయలు అయితే మీ అప్పు లక్ష అయితే ఇక లాభం ఏంటీ? -- కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాకులు

Last Updated : May 17, 2022, 10:22 PM IST

ABOUT THE AUTHOR

...view details