అంతర్జాల ఆధారిత వ్యాపారాలు నిర్వహిస్తున్న తమ సంస్థలో పెట్టుబడులు పెడితే 44 వారాల్లో రెట్టింపు లాభాలొస్తాయంటూ.. ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న జస్ట్ డీల్ ట్రేడింగ్ కంపెనీ మదుపరులను మోసం చేసింది. పది నెలల క్రితం జస్ట్ డీల్ కంపెనీ సీఎండీతో పాటు కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ వచ్చారు. సికింద్రాబాద్లోని ఓ హోటల్లో సమావేశం నిర్వహించారు. తమ కంపెనీలో రూ. 11 వేలు ఒకేసారి మదుపు చేస్తే వారానికి రూ. 500 చొప్పున 44 వారాలు మదుపరుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని నమ్మించారు. రూ. 55వేలు మదుపు చేస్తే వారానికి రూ. 2500.. బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తామని తెలిపారు. ఇలా ఆ సంస్థ ప్రతినిధులునగరానికి చెందిన 600 మందిని నమ్మించి.. రూ. 2.5 కోట్లు కొల్లగొట్టారు. రూ. 11 వేలు, రూ. 55 వేలు, రూ. 1.10 లక్షల చొప్పున మదుపు చేసిన వారికి తొలుత వారి బ్యాంక్ ఖాతాల్లో వారం వారం నగదు జమ చేశారు. ఇలా 24 వారాల పాటు క్రమం తప్పకుండా నగదు జమ చేశాక... సాంకేతిక కారణాలంటూ నగదు జమచేయడం నిలిపివేశారు. మదుపరుల్లో కొందరు పదిహేను రోజుల క్రితం జస్ట్ డీల్ ట్రేడింగ్ కంపెనీ ప్రతినిధులకు ఫోన్ చేశారు. వారు స్పందించకపోవడం వల్ల మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల వివరాలను సేకరిస్తున్నారు.
మదుపరులను ముంచిన జస్ట్ డీల్ ట్రేడింగ్ సంస్థ - Just Deal Trading Company, which engages investors
ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న జస్ట్ డీల్ ట్రేడింగ్ కంపెనీ మదుపరులను మోసం చేసింది. అంతర్జాల ఆధారిత వ్యాపారాలు నిర్వహిస్తున్న తమ సంస్థలో పెట్టుబడులు పెడితే 44 వారాల్లో రెట్టింపు లాభాలొస్తాయంటూ మదుపరులను నట్టేట ముంచింది.

Just Deal Trading Company, which engages investors
Last Updated : Jul 18, 2019, 7:24 AM IST
TAGGED:
RP