ఎన్డీయే ప్రభుత్వంలో ఏ ఒక్క విమానమైనా కొన్నారా అని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడున్న యుద్ధ విమానాలన్ని కాంగ్రెస్ హయాంలోనే కొనుగోలు చేశారని వెల్లడించారు. దేశ రక్షణకు ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని మీడియా ప్రతినిధులను నిందించడాన్ని ఖండిస్తున్నామన్నారు. రఫేల్‌ను ఎందుకు అంత ఎక్కువ ఖర్చుతో కొన్నారో చెప్పకుండా ప్రధాని మోదీ పొంతనలేకుండా మాట్లాడుతున్నారని జైపాల్ ఆరోపించారు. బాలాకోట్‌పై దాడిని కాంగ్రెస్ కూడా అభినందించిందని పేర్కొన్నారు. హెచ్ఏఎల్ను తొలగించి అనిల్ అంబానీకి మేలు చేసి.. దానిని దాచిపెట్టేందుకే ప్రధాని ఇతర కారణాలు చెబుతున్నారని ఆరోపించారు.
ఒక్క విమానమైనా కొన్నారా?
ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్డీయే హయాంలో ఒక్క యుద్ధ విమానాన్ని కూడా కొనుగోలు చేయలేదని ఆరోపించారు. రఫేల్‌ను ఎక్కువ ఖర్చుతో ఎందుకు కొన్నారో చెప్పకుండా, జాతి రక్షణ అంటూ ప్రధాని ఏవేవో మాట్లాడుతున్నారన్నారు.
రఫేల్ వివాదంపై మాట్లాడుతున్న జైపాల్‌రెడ్డి