Department of Tribal Welfare: ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా పర్చూరులోని గిరిజన పాఠశాలలో లైంగిక వేధింపులు, మత్తుపదార్థాల వినియోగం వంటి ఆరోపణలపై ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక అందచేస్తామని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ ఉపకార్యదర్శి ఎం.రామ్మోహన రెడ్డి తెలిపారు. పర్చూరులోని గిరిజన పాఠశాలపై వస్తున్న ఆరోపణలపై ఉన్నతాధికారుల అదేశాల మేరకు పాఠశాలలో విచారణ జరిపారు. ప్రిన్సిపాల్ ఖాదర్ వలీ, ఇతర సిబ్బంది నుండి లిఖితపూర్వకంగా వివరాలు తీసుకున్నారు.
విద్యార్థులు, ఒక మహిళ సిబ్బందిపై వ్యాయామ ఉపాధ్యాయుడు లైంగికంగా వేధిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై వివరాలు ఆడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల మధ్య విభేదాలు, లైంగికంగా వేధిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలు, అనధికారికంగా సిబ్బంది గైర్హాజరు.. వంటి అంశాలపై ఎలాంటి తీసుకున్నారో ఆడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతోనూ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.