ప్రథమ సంవత్సరంలో 69.1శాతం ఉత్తీర్ణత
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మొదటి సంవత్సరం పరీక్షల్లో 65.1 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 86వేల 98 మంది పరీక్షలు రాయగా.. వారిలోలక్ష 86వేల 460 మంది ఉత్తీర్ణులయ్యారు. ఏ గ్రేడ్లో 54 శాతం, బీ గ్రేడ్లో 22.4 శాతం, సీ గ్రేడ్లో 13.7 శాతం పాసయ్యారు. బాలికలు 70 శాతం, బాలురు 60.5శాతం ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్ కోర్సుల్లో మరో 47.4 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో బాలికలదే పైచేయి
రీకౌంటింగ్ దరఖాస్తులు ఈనెల 25 నుంచి స్వీకరణ
మొత్తం ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణత 69.1శాతానికి పెరిగింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఈనెల 25 నుంచి 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు.
సాంకేతిక వ్యవస్థ పాలుపంచుకున్న సంస్థలు
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకన ప్రక్రియలో గ్లోబరీనాతో పాటు... డేటాటెక్, మేగ్నటిక్ సంస్థలు, జేఎన్టీయూహెచ్ సాంకేతిక వ్యవస్థ పాలుపంచుకున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: కొత్త అసెంబ్లీ నిర్మాణం కేసుపై హైకోర్టులో విచారణ