India Car Racing League: ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఫార్మూలా-ఈ పోటీలకు సన్నాహకంగా భావిస్తున్న జరిగిన ఇండియన్ రేసింగ్ లీగ్... ప్రధాన పోటీలు జరగకుండానే ముగిసింది. సమయాభావం, రేసర్లకు స్వల్ప ప్రమాదాల వల్ల అసలైన రేసును నిర్వాహకులు నిలిపివేశారు. దీంతో అసలైన తుది రేసింగ్ మజాను భాగ్యనగరవాసులు ఆస్వాదించలేకపోయారు. క్వాలిఫయింగ్ రేస్‌లో కొత్త ట్రాక్‌పై పలుమార్లు కార్లు ఢీకొని రేసర్లకు గాయాలయ్యాయి.
నాలుగు ఫార్ములా కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఇందులో ఒక రేసర్‌కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయాలకు తోడు చీకటి పడటం, రేసింగ్‌కు రెండ్రోజులు మాత్రమే అనుమతి ఉండటంతో సోమవారం నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇండియన్ రేసింగ్‌లోని మూడు ప్రధాన పోటీలు లేకుండానే సాధారణ పోటీలతోనే నిర్వాహకులు ముగించారు.
ఇండియన్ రేసింగ్ లీగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. శనివారం కూడా ప్రధాన పోటీలు నిర్వహించకుండానే ట్రయల్ రన్‌తో నిర్వాహకులు సరిపెట్టారు. రేసర్లు ట్రాక్‌పై అలవాటు పడేందుకు ప్రధాన పోటీలు ఇలా చేశామని తెలిపారు. ప్రధాన ఈవెంట్లు ఇవాళైనా జరుగుతాయని భావించినప్పటికీ సాధ్యపడలేదు. మరోవైపు వేల రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్నప్పటికీ లోపలికి అనుమతించలేదని కొందరు ఆందోళన వ్యక్తంచేశారు. పోలీసులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వారి కుటుంబసభ్యులు గ్యాలరీలో ఉండటంతోనే లోపలికి పంపించలేదనే ఆరోపణలు వినిపించాయి. మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్‌అలీ, ఎమ్మెల్యేలు పోటీలను చూసేందుకు వచ్చారు. ఫార్ములా ఈ రేసింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్ వేదికగా జరగనుంది.
భాగ్యనగరంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఇండియా కార్ రేసింగ్ లీగ్ ఇవీ చదవండి: