కరోనా కట్టడిలో భాగంగా.. రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గించే దిశగా పలు చర్యలు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్లాట్ఫామ్ టికెట్ ధరలు పెంచుతూ ఆదేశాలు జారీచేసింది. సికింద్రాబాద్ స్టేషన్లో.. రూ.30 ఉన్న ధరను రూ.50కు పెంచుతున్నట్లు ప్రకటించింది.
రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ ధర రూ.50కి పెంపు
కరోనా మహమ్మారి నేపథ్యంలో.. దక్షిణ మధ్య రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. నెల తిరగకుండానే మరోసారి ప్లాట్ఫామ్ టికెట్ ధరలను పెంచింది. స్టేషన్లలో రద్దీ తగ్గించే దిశగా చర్యలు చేపట్టినట్లు వివరించింది.
రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ ధర
రేపటి నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నట్లు.. సీపీఆర్ఓ రాకేశ్ తెలిపారు. గతంలో రూ.10 ఉన్న ప్లాట్ఫామ్ ధరను ఇటీవలే రూ.30కి పెంచింది. నెల తిరగకుండానే మళ్లీ రూ.50కు పెంచడం.. తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
ఇదీ చదవండి:సాగర్లో దూకుడు పెంచిన కమలనాథులు... రంగంలోకి ముఖ్య నేతలు