తెలంగాణ

telangana

ETV Bharat / state

IIT HYDERABAD: ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన మైక్రోస్కోప్ రూపకల్పన

ఐఐటీ హైదరాబాద్​ మరో నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన మైక్రోస్కోప్​ను రూపొందించింది. ఏదైనా కణజాలాన్ని ఒకవైపు కొన్ని మిల్లీమీటర్ల కొలత చేయగలగడం దీని ప్రత్యేకతగా పేర్కొంది.

ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన మైక్రోస్కోప్ రూపకల్పన
ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన మైక్రోస్కోప్ రూపకల్పన

By

Published : Jun 29, 2021, 10:48 PM IST

ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన మైక్రోస్కోప్​ను ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు రూపొందించారు. మస్కోప్ పేరుతో ఈ మైక్రోస్కోప్​ను డాక్టర్ శిశిర్​కుమార్ పరిశోధనాలయంలో అభివృద్ధి చేశారు. రక్తంలోని అతి చిన్న కణాల వంటి వాటిని కంప్యూటర్‌కు అనుసంధానమైన అనేక మైక్రోస్కోప్​ల ఆధారం లేకుండా ఈ ఒక్క మస్కోప్​లోనే చూసేలా దీనిని తయారు చేశారు. అతి తక్కువ ఖర్చుతో వైద్య పరికరాలను మొబైల్​తో అనుసంధానం చేసుకొని పరీక్షించవచ్చని.. ఏదైనా కణజాలాన్ని ఒకవైపు కొన్ని మిల్లీమీటర్ల కొలత చేయగలగడం దీని ప్రత్యేకతగా ఐఐటీ హైదరాబాద్ పేర్కొంది.

అద్దం మీద రక్తం చుక్కలు వేసి పరిశీలించే కణాలను ఎక్కువ క్వాలిటీ చిత్రాలను అందిస్తుందని.. అతి చిన్న ప్రాంతంలో ఎక్కువ మస్కోప్‌లను వినియోగించేలా వీలుంటుందని తెలిపారు. ఈ మస్కోప్ వైద్యరంగంతో పాటు వ్యవసాయం, జంతు, పర్యావరణ రంగాల్లో సూక్ష్మ కణాల పరిశీలనను మరింత చౌకగా మార్చనుందని ఐఐటీ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: GOVERNER: వారి ఆదాయం పెరిగితేనే అన్నిరంగాల్లో అభివృద్ధి: తమిళిసై

ABOUT THE AUTHOR

...view details