కేంద్ర జీఎస్టీ హైదరాబాద్ జోన్ చీఫ్ కమిషనర్గా మల్లికా ఆర్య నియమితులయ్యారు. గతేడాది జూన్లో అప్పటి చీఫ్ కమిషనర్ బీబీ అగర్వాల్ పదవి విరమణ అనంతరం ఖాళీ ఏర్పడింది. అనంతరం ఆ స్థానంలో పూణే కేంద్ర జీఎస్టీ చీఫ్ కమిషనర్ వాసా శేషగిరిరావుకు పూర్తి బాధ్యతలు అప్పగించారు.
తాజాగా పలువురు ప్రిన్సిపల్ కమిషనర్లకు చీఫ్ కమిషనర్గా పదోన్నతి లభించింది. అందులో భాగంగా దిల్లీలో ప్రిన్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న మల్లికా ఆర్య పదోన్నతిపై రాష్ట్రానికి కేంద్ర జీఎస్టీ చీఫ్ కమిషనర్గా నియమితులయ్యారు.