‘‘మెహిదీపట్నంలో ఉంటున్న సివిల్ ఇంజినీర్ అభిజిత్ లింగంపల్లిలో ఓ ప్రాజెక్ట్‌ను చూద్దామని సోమవారం మధ్యాహ్నం కారులో వెళ్లాడు. సాయంత్రం 5.10గంటలకు తిరిగి వస్తుండగా వర్షం మొదలైంది. గచ్చిబౌలి, షేక్‌పేట మీదుగా వెళ్తే ట్రాఫిక్‌లో చిక్కుకుపోతామని భావించి పటాన్‌చెరు, మియాపూర్ మీదుగా బయలు దేరాడు. కూకట్‌పల్లి జేఎన్‌టీయూ వద్దకు రాగానే.. మూసాపేటలో భారీ వర్షం, ట్రాఫిక్‌జాం అంటూ గూగుల్ చూపించింది. అక్కడి నుంచి హైటెక్ సిటీ మీదుగా మళ్లించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద ట్రాఫిక్ స్తంభించింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్-12కు వచ్చేసరికి గంట పట్టింది. సిటీ సెంట్రల్‌కు 30 నిమిషాలు.. బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రి నుంచి మెహిదీపట్నంకు 30 నిమిషాలైంది. కేవలం 18 కి.మీ. దూరం ప్రయాణిచేందుకు 2.30 గంటల సమయం పట్టింది’’
నగరంలో సోమవారం కురిసిన భారీవర్షం కారణంగా జనజీవనంపై పడిన ప్రభావానికి ఇది ఓ ఉదాహరణ మాత్రమే. ఉరుముల్లేని పిడుగులా సాయంత్రం కురిసిన భారీ వర్షంతో కీలకప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. సాయంత్రం 4.20 గంటలకు ప్రారంభమైన వర్షం.. రాత్రి 8 గంటల వరకూ పడింది. రహదారులపై వరద ప్రవహిస్తుండడంతో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచింది. నగరం, శివారు ప్రాంతాల నుంచి ప్రాణాపాయ పరిస్థితుల్లో రోగులను తీసుకువస్తున్న అంబులెన్స్‌లు పెద్ద సంఖ్యలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి.
నగరం నలుదిశలా అష్టకష్టాలు
భారీ వర్షం కారణంగా నగరం నలువైపులా గమ్యస్థానాలకు వెళ్తున్న వాహనదారులు నరకయాతన అనుభవించారు. కారులో ఉన్నవారు ఇంటికి వెళ్లేసరికి ఎంతసేపవుతుందోని ఆందోళన చెందగా... ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నవారు తడిసిపోయారు.
- దిల్‌సుఖ్‌నగర్ నుంచి కూకట్‌పల్లి వరకూ హైవేపై 3 గంటల పాటు ట్రాఫిక్ నిలిచింది. గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం, జూబ్లీహిల్స్-సికింద్రాబాద్ మార్గం వాహనాలతో నిండిపోయింది.
- పంజాగుట్ట కూడలి, ప్రగతి భవన్, బేగంపేట, హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్ వరకూ ఖాళీ లేకుండా వాహనాలు నిలిచిపోయాయి.
- సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ కూడలి, రేతిఫైల్ బస్‌స్టాప్, చిలకలగూడ సర్కిల్ ప్రాంతాల్లో వరద నీరు రహదారులపై ప్రవహిస్తుండడంతో గంటసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్యారడైజ్ సర్కిల్ నుంచి పంజాగుట్ట వైపు వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
- నాంపల్లి నుంచి లక్డీకాపూల్ మీదుగా ఖైరతాబాద్, పంజాగుట్ట వైపునకు, లక్డీకాపూల్ నుంచి ఖైరతాబాద్‌ను దాటేందుకు 20 నిమిషాలు, ఖైరతాబాద్ కూడలి నుంచి పంజాగుట్ట వరకూ 25 నిమిషాలు పట్టింది.
- అప్పర్ ట్యాంక్‌బండ్ నుంచి కర్బలా మైదాన్, రాణిగంజ్, ప్యారడైజ్ జంక్షన్, సీటీవో జంక్షన్ వరకూ వాహనాలు రెండువైపులా నిలిచిపోయాయి. మాసాబ్ ట్యాంక్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1/12 మీదుగా తాజ్‌కృష్ణా, జీవీకేమాల్, వెంగళ్‌రావు పార్కు, నాగార్జున సర్కిల్ మార్గంలో ట్రాఫిక్ భారీగా స్తంభించింది.
110 ఫిర్యాదులు..