Hyderabad Begging Mafia :హైదరాబాద్‌లో ఇటీవల హిజ్రాలు, చిన్నారులు, మహిళలతో భిక్షాటన చేయిస్తున్న వారిపై పోలీసులు ప్రత్యేకనిఘా పెట్టారు. ఈ తరుణంలో సేవా ఫౌండేషన్ పేరిట అక్రమాలకు పాల్పడుతున్న బెగ్గింగ్ మాఫియా ముఠా(Hyderabad Begging Mafia) పోలీసులకు చిక్కింది. నిజామాబాద్ ఆర్మూర్‌కి చెందిన గడ్డి గణేష్.. ఎల్బీనగర్ మన్సూరాబాద్‌లో 'అమ్మ చేయూత ఫౌండేషన్' పేరిట 2019లో సేవాసంస్థ ప్రారంభించాడు. అనాథలకు సాయంతో పాటు పలు కార్యక్రమాలు చేస్తున్నానని పలువురు నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు.
NGO Frauds in Hyderabad :అతనికి 2020లో నల్గొండకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు పరిచయమయ్యారు. వారిద్దరు కేశావత్ రవి, కేశావత్ మంగులుగా నగరంలో ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఫౌండేషన్ పేరిట గణేశ్ భిక్షాటన బాక్సులు తయారుచేయించి ఇస్తానని.. అందుకు ఒక్కో బాక్సుకు నెలకు రూ.2వేలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం ఫౌండేషన్ పేరిట 12బాక్సులు ఏర్పాటుచేసి వాటిపై క్యూఆర్ కోడ్ అమర్చారు. భిక్షాటన కోసం నిరుద్యోగ యువతులను ఎంచుకొని వారికి డ్రెస్‌కోడ్‌తో పాటు గుర్తింపుకార్డు ఇచ్చి ప్రధాన కూడళ్ల వద్దకు భిక్షాటన చేయిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 10 గంటల తర్వాత బాక్సులు తెరిచి వచ్చిన డబ్బును అన్నదమ్ములు సగం.. భిక్షాటన చేసినవారు సగం పంచుకుంటున్నారు. ఇలా ఈ మూడేళ్లలోనే నేరగాళ్లు లక్షల్లో సంపాదించారు.
'అమ్మ చేయూత' అనే ఒక స్వచ్ఛంద సంస్థను గడ్డి గణేశ్ 2019లో ప్రారంభించడం జరిగింది. అతను ఏదో చిన్న ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నట్టు చూపించి, భారీ మొత్తంలో చాలామంది దగ్గర డబ్బులు సేకరించడం జరిగింది. ఈ క్రమంలో అతనికి కేశావత్ రవి, మంగులు అనే ఇద్దరు అన్నదమ్ములు పరిచయమయ్యారు. వీరిద్దరు గణేశ్‌తో మాట్లాడి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈ అమ్మ చేయూత ఫౌండేషన్‌కి సంబంధించిన కొన్ని డబ్బుల డబ్బాలను ఏర్పాటు చేసుకొని వీళ్లు అద్దెకు తీసుకున్నారు. :- రూపేష్, నైరుతి మండల డీసీపీ