ప్రైవేట్ విద్యా వ్యవస్థను సంపూర్ణంగా రద్దు చేయాలని విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆచార్య హరగోపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఇంటర్ పరీక్ష ఫలితాల్లో మార్కుల కుంభకోణానికి సంబంధించి జరుగుతున్న ఆందోళనను ప్రజా ఉద్యమంగా మలచడం ఎలా అనే అంశంపై చర్చ నిర్వహించారు. అందరికీ నాణ్యమైన విద్యా విధానాన్ని అమలు చేయాలని హరగోపాల్ కోరారు.
పరీక్ష విధానాన్ని పారదర్శకంగా చేపట్టాలని కోరారు. ఇంటర్ పరీక్ష పత్రాలను పునః మూల్యాంకనం చేయాలని కోరారు. విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 7న 31 జిల్లా, మండల కేంద్రాల్లో విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చాయి. కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 7 న రాష్ట్రంలోని 31 జిల్లా , మండల కేంద్రాల్లో విద్యార్థి , ఉపాధ్యాయ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
7న విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నిరసన - general secretary
ఇంటర్ పరీక్షల వాల్యూయేషన్ విధానంపై గ్లోబరినా సంస్థకు అనుభవం, అనుమతి ఉన్నాయా అనే సందేహాన్ని ఆచార్య హరగోపాల్ వ్యక్తం చేశారు. బాధిత ఇంటర్ విద్యార్థుల కుటుంబాలను గుర్తించి వారికి న్యాయం జరిగేలా ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

ఇంటర్ పరీక్ష పత్రాలను పునః మూల్యాంకనం చేయాలి : హరగోపాల్
ఇంటర్ పరీక్ష ఫలితాలకు సంబంధించి ప్రజా ఉద్యమమే జరగాలి : హరగోపాల్
ఇవీ చూడండి : 'ఐదో విడత' ప్రచారానికి తెర.. 6న పోలింగ్