ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో పోకిరీలు రెచ్చిపోయారు. విశాఖకు వచ్చిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లు విసిరారు. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా బుధవారం విశాఖ రైల్వే స్టేషన్‌కు ఈ రైలును రప్పించారు. సిబ్బంది, రైల్వే అధికారులు పరిశీలించిన అనంతరం సాయంత్రం కంచరపాలెం రామ్మూర్తిపంతులుపేట వద్ద రైలును నిలిపి ఉంచారు. ఈ క్రమంలో కొందరు ఆకతాయిలు రైలుపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో వందే భారత్ రైలు రెండు కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. రైలుపై రాళ్లు విసిరిన ఆకతాయిల కోసం రైల్వే పోలీసులు గాలిస్తున్నారు.
దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వందే భారత్ రైలు తొలిసారి విశాఖ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా ఇవాళ ఉదయం రైల్వేస్టేషన్‌కు ఈ రైలును రప్పించారు. పూర్తిగా చైర్ కార్ బోగీలున్న ఈ రైలు అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేర్చుతుందని అందువల్ల ఈ వందే భారత్ రైలుకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ రైలు ప్రయాణికులకు సౌకర్యవంతగా ఉంటుందని.. 9.30 గంటల్లోనే విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు చేరుకుంటుందని తెలిపారు.