తెలంగాణ

telangana

ETV Bharat / state

హోం ఐసోలేషన్​లో బాధితుల వ్యథ వర్ణనాతీతం.. - గ్రేటర్ హైదరాబాద్

కరోనా కట్టడిని అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. పాజిటివ్​ వచ్చిన వ్యక్తులను పట్టించుకునే వాళ్లు కరవయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్​ జీహెచ్​ఎంసీ సర్కిల్​ పరిధిలో హోం ఐసోలేషన్​లో ఉండి చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం మెడికల్​ కిట్స్​ కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.

home isolation problems in greater hyderabad
హోం ఐసోలేషన్​లో ఉండి చికిత్స పొందుతున్న వారికి తప్పని సమస్యలు!

By

Published : Aug 11, 2020, 7:09 PM IST

గ్రేటర్ హైదరాబాద్ ఉప్పల్ జీహెచ్​ఎంసీ సర్కిల్ పరిధిలో కరోనా వైరస్ బాధితులకు సమస్యలు తప్పడం లేదు. ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్న బాధితులు హోం ఐసోలేషన్​లో ఉండి చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం ఉచితంగా మెడికల్ కిట్స్​ ఇస్తామని, వారికి పోలీసు, వైద్య ఆరోగ్య, జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో కావాల్సిన సేవలు అందించేందుకు అందుబాటులో ఉంటారని చెబుతున్నా.. అలాంటి సేవలు కనిపించడం లేదు.

వైరస్ నిర్థరణ అయిన బాధితుడి నివాసానికి వెళ్లిన పోలీసులు, జీహెచ్​ఎంసీ సిబ్బంది ‌వివరాలు సేకరించి వెళ్తున్నారు. బాధితుడే కంట్రోల్ రూంకు ఫోన్ చేస్తే పది రోజుల‌ తర్వాత సిబ్బంది వచ్చి ప్రభుత్వం అందించే మెడికల్ కిట్స్ ఇస్తున్నారు. అప్పటి వరకు బాధితుడే చికిత్సకు అయ్యే ఖర్చులను భరిస్తున్నారు.

ఇవీ చూడండి: తెలంగాణలోని కోర్టుల్లో సెప్టెంబర్ 5 వరకూ లాక్‌డౌన్ పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details