' ఆర్టీసీ కార్మికుల జీతాలు సోమవారంలోపు చెల్లించాలి' - high court said RTC workers September salaries to be paid before this monady

11:23 October 16
' ఆర్టీసీ కార్మికుల సెప్టెంబర్ నెల జీతాలు సోమవారంలోపు చెల్లించాలి'
ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల వేతనాల చెల్లింపు ప్రక్రియ ఈ నెల 21లోగా పూర్తి చేయాలని యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ నెల వేతనం చెల్లించడంలేదని టీఎంయూ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. సమ్మెను సాకుగా చూపి పనిచేసిన రోజులకు కూడా జీతం చెల్లించడంలేదని, కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. పనిచేసిన తర్వాత వేతనం ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్దమని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది సమ్మెలో ఉన్నందున వేతనాల చెల్లింపు ప్రక్రియ ఆలస్యమైందని ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టుకు నివేదించింది. సోమవారం నాటికి చెల్లిస్తామని తెలిపింది. ఈ నెల 21లోగా కార్మికులకు వేతనాలు చెల్లించి పూర్తి వివరాలతో తమకు నివేదిక సమర్పించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ధర్మాసనం ఆదేశించింది.