అసంఘటిత కార్మికుల వివరాల నమోదు వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అసంఘటిత కార్మికుల నమోదుపై దామోదర రాజనర్సింహ దాఖలు చేసిన పిల్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ప్రత్యేక సీఎస్ రాణి కుముదినీ విచారణకు హాజరయ్యారు.
'అసంఘటిత కార్మికుల వివరాల నమోదు వెంటనే ప్రారంభించాలి' - High Court on unorganized workers
అసంఘటిత కార్మికుల నమోదుపై దామోదర రాజనర్సింహ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రత్యేక సీఎస్ రాణి కుముదినీ విచారణకు హాజరయ్యారు.

అసంఘటిత కార్మికుల నమోదుపై హైకోర్టులో విచారణ
ఈ సందర్భంగా అసంఘటిత కార్మికుల నమోదు ఎందుకు ప్రారంభించలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. కేంద్రం సాఫ్ట్వేర్ సిద్ధం చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచేందుకు డేటా సిద్ధంగా ఉందా అని హైకోర్టు అడిగింది. ఈ మేరకు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ప్రత్యేక సీఎస్ తదుపరి విచారణకూ హాజరు కావాలని ఆదేశించింది.