రుషికొండ తవ్వకాలపై కేంద్ర అధికారులతో కమిటీకి ఏపీ హైకోర్టు ఆదేశం - High Court verdict in Rushikonda case

13:12 December 22
రుషికొండ తవ్వకాలపై ఐదుగురు కేంద్ర అధికారులతో కమిటీకి హైకోర్టు ఆదేశం
AP HC ON RUSHIKONDA : ఆంధ్రప్రదేశ్లోని రుషికొండ తవ్వకాల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ నియమించాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖను ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఏర్పాటైన కమిటీలో ఉన్న రాష్ట్ర అధికారులను తక్షణమే తొలగించాలని స్పష్టం చేసింది. రుషికొండపై జరుగుతున్న తవ్వకాలు, నిర్మాణాలను కమిటీ పరిశీలించాలని ఆదేశించింది. కొత్త కమిటీలో నియమించిన సభ్యుల వివరాలు బెంచ్ ముందుంచాలని సూచించింది. జనవరి 31లోపు కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇవీ చదవండి:తెలంగాణ సర్కార్కు షాక్.. రూ.900 కోట్ల జరిమానా విధించిన ఎన్జీటీ
భారత్-చైనా వివాదంపై చర్చకు విపక్షాల డిమాండ్.. లోక్సభ వాయిదా