తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రతా దళాలకు లొంగిపోయిన మావోయిస్టు హిడ్మా.. నిజమెంత..? - సుక్మాలో 16 మంది నక్సల్స్‌ లొంగిపోయారు

Hidma Surrendered CRPF Force In Chhattisgarh: కేంద్ర బలగాలనే గడగడ లాడించిన హిడ్మా పోలీసులకు లొంగిపోయాడనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇలాంటి వ్యక్తి అలా ఎలా పోలీసులకు దొరికిపోయాడనే అనుమానం వస్తోంది.

hidma
hidma

By

Published : Mar 24, 2023, 9:46 PM IST

Updated : Mar 25, 2023, 8:47 AM IST

Hidma Surrendered CRPF Force In Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని దండ కారణ్యంలో సీఆర్పీఎఫ్‌, కోబ్రా దళాలకు ముచ్చెమటలు పట్టించిన పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) కమాండర్‌ మడావి హిడ్మా సీఆర్పీఎఫ్‌ భద్రతా బలగాల ముందు లొంగిపోయాడనే వార్తలు వస్తున్నాయి. మోస్ట్‌ వాంటెండ్‌ హిడ్మాతో పాటు మరో 15 మంది నక్సలైట్లు భద్రతా దళాల ముందు లొంగిపోయారనే విషయాన్ని భద్రతా దళాలు తెలిపాయి.

అయితే రెండు నెలల క్రితం దండకారణ్యంలో జరిగిన సీఆర్‌పీఎఫ్‌ భద్రతా దళాలు, ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల గగనతల దాడులతో పాటు.. భారీ ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మరణించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత హిడ్మా చనిపోలేదని క్లారటీనిచ్చారు. మరోసారి హిడ్మా గురించిన వార్తలు బయటకు వచ్చాయి. హిడ్మా లొంగిపోయాడనే విషయం బయటకు వచ్చింది. ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. అయితే అంతకు రెండు నెలల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌, అసలు హిడ్మా ఎవరనే విషయాలను తెలుసుకుందాం.

అతి చిన్న వయసులోనే మావోయిస్టు కేంద్ర కమిటిలో చోటు: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాకు చెందిన హిడ్మా మావోయిస్టుగా అంచెంచెలుగా ఎదుగుతూ.. అతి చిన్న వయస్సులోనే మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా స్థానం దక్కించుకున్నాడు. అతడు దాడి చేస్తే మావోయిస్టులు కన్నా.. అవతలి భద్రతా సిబ్బందికే 90శాతం రిస్క్‌ ఎక్కువ అనేది ప్రాచుర్యంలో ఉంది. పీపుల్‌ లిజరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ)కు కమాండర్‌గా ఉంటూ.. ఈ దళంలోని సభ్యులు అత్యాధునిక ఆయుధాలు వాడేలా చూసుకునేవాడు.

ఆ విధంగానే వారికి శిక్షణ ఇచ్చేవాడు. గతంలో సుక్మా జిల్లాలో జరిగిన భద్రతాదళ దాడుల్లో 100శాతం ఇతనే చేసేవాడని సీఆర్‌పీఎఫ్‌ బలగాలు చెప్పేవారు. ఇతని దాడుల వల్ల భద్రతా సిబ్బందికి భారీగానే ప్రాణనష్టమే జరిగేది. అయితే ఇతను ఎంపికైన కమిటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అత్యధికం.. సుక్మా నుంచి వెళ్లిన మొదటి వ్యక్తి హిడ్మానే. అలాంటి వ్యక్తి భద్రతా దళాలకు లొంగిపోయాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరో 15 మంది నక్సలైట్లు లొంగిపాటు: ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్‌ ప్రభావిత జిల్లా సుక్మాలో హిడ్మాతో పాటు కవాసి పాలే అనే మావోయిస్టు ఇతనిపై రూ.8 లక్షల రివార్డును పోలీసులు ఉంచారు. అలాగే మరో నక్సలైట్‌ సోమపై రూ. 5లక్షల రివార్డ్‌ ఉందని సీఆర్‌పీఎఫ్‌ 74 కార్పస్‌ కమాండెంట్‌ కుల్దీప్‌ కుమార్‌ జైన్‌, 266 బెటాలియన్‌ డిప్యూటీ కమాండెంట్‌ సందీప్‌ బిజానియా, ఏఎస్‌పీ కిరణ్‌ చౌహాన్‌ తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వ పాలనా విధానాలు, భద్రతా బలగాల పూనా నార్కోమ్‌ ప్రచారానికి ప్రభావితమై ఈ 16మంది నక్సలైట్లు లొంగిపోయారని సుక్మా ఏఎస్పీ కిరణ్‌ చౌహాన్‌ తెలిపారు. వీరిలో పదం దేవా, జమ్మర్‌ నీలం కవాసి, సోధి బుద్రి, పోడియం సుక్క, పోడియం పొజ్జా ఉన్నారు. వీరే కాకుండా మడావి అయిత, హేమ్లా మాసా, వేకో పొజ్జా, కవాసి మోటు, కవాసి సోమడు, మడ్కం సుక్దా, మద్కం హిడ్మా కూడా ఉన్నారని ఆయన చెప్పారు. నక్సలైట్‌ మద్వి హిడ్మా తుపాకీతో లొంగిపోయాడని వివరించారు. అయితే సుక్మా భద్రతా దళాలపై దాడుల్లో ఎక్కువగా భద్రతా సిబ్బందిని మట్టుపెట్టిన ఆ మాడావి హిడ్మానా అనేదే తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి:

Last Updated : Mar 25, 2023, 8:47 AM IST

ABOUT THE AUTHOR

...view details