తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ కోసం ప్రభాకర్‌ ఎనలేని కృషి చేశారు: మంత్రి హరీశ్‌రావు

Minister Harish Rao: దివంగత ఇంజినీర్​ ప్రభాకర్ తెలంగాణ రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ మాజీ అధ్యక్షుడు, దివంగత ఇంజినీర్ ప్రభాకర్ విగ్రహాన్ని హైదరాబాద్​లోని విశ్వేశ్వరయ్య భవన్​లో ఆయన ఆవిష్కరించారు. ప్రతి జయంతికి ప్రభాకర్ పేరిట కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

తెలంగాణ కోసం ప్రభాకర్‌ ఎనలేని కృషి చేశారు: మంత్రి హరీశ్‌రావు
తెలంగాణ కోసం ప్రభాకర్‌ ఎనలేని కృషి చేశారు: మంత్రి హరీశ్‌రావు

By

Published : Apr 15, 2022, 7:51 PM IST

Minister Harish Rao: ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ మాజీ అధ్యక్షుడు, దివంగత ప్రభాకర్ విగ్రహాన్ని హైదరాబాద్​లోని విశ్వేశ్వరయ్య భవన్​లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్​ రావు ఆవిష్కరించారు. ప్రభాకర్ మొదటి స్మారకోపన్యాస కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. దివంగత ప్రభాకర్ తెలంగాణ రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్న ఆయన... హైదరాబాద్​కు కృష్ణా జలాలను తీసుకురావడం కోసం చాలా కృషి చేశారని అన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ తెలంగాణ కోసం ఎనలేని కృషి చేశారన్న హరీశ్​ రావు.. రాష్ట్ర ప్రయోజనాలను దృషిలో పెట్టుకొని పలు సూచనలు చేశారని గుర్తు చేసుకున్నారు.

ఏ విషయాన్నైనా ప్రభాకర్ నిర్మొహమాటంగా సూటిగా చెప్పేవారన్న మంత్రి.. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోనూ ఆయన సూచనలు పొందపొర్చారని తెలిపారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్​కు జాతీయ స్థాయిలో అధ్యక్షుడిగా తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింప చేశారని, ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. ప్రతి జయంతికి ప్రభాకర్ పేరిట కార్యక్రమాలు చేపడతామని మంత్రి హరీశ్​ రావు తెలిపారు.

తెలంగాణ కోసం ప్రభాకర్‌ ఎనలేని కృషి చేశారు: మంత్రి హరీశ్‌రావు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details