తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరుపేదలకు బన్సీలాల్​పేట్​ కార్పొరేటర్​ ఆపన్నహస్తం - హైదరాబాద్​ తాజా వార్తలు

పేద ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యంతో కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బన్సీలాల్‌పేట్ పరిధిలో నిరుపేద కుటుంబాలను స్థానిక కార్పొరేటర్ కుర్మా హేమలత ఆదుకున్నారు. వారికి నిత్యావసర సరకులు అందజేశారు. రెండు పడక గదుల ఇల్లు నిర్మిస్తున్న వలస కూలీలు పడుతున్న అవస్థల గురించి తెలుసుకుని వారికి చేయూత ఇస్తున్నారు.

నిరుపేదలకు బన్సీలాల్​పేట్​ కార్పొరేటర్​ ఆపన్నహస్తం
నిరుపేదలకు బన్సీలాల్​పేట్​ కార్పొరేటర్​ ఆపన్నహస్తం

By

Published : Apr 25, 2020, 11:50 AM IST

సికింద్రాబాద్‌ బన్సీలాల్‌పేట్ పరిధిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు స్థానిక కార్పొరేటర్ కుర్మా హేమలత ఆపన్నహస్తం అందించారు. లాక్‌డౌన్ అమలు నుంచి స్థానికంగా ఉంటున్న వలస కార్మికులు, పేదలకు నిత్యావసరాల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు.

నిరుపేదలతో పాటు రెండు పడక గదుల ఇల్లు నిర్మిస్తున్న వలస కూలీలు పడుతున్న అవస్థల గురించి తెలుసుకుని వారికి చేయూత ఇస్తున్నారు కార్పొరేటర్​ హేమలత. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ.. స్వీయ నియంత్రణ బాధ్యత కలిగి ఉండాలని కోరారు.

ఇవీ చూడండి:టార్పాలిన్ల సరఫరాకు చేతులెత్తేసిన గుత్తేదారు.. టెండర్లు రద్దు

ABOUT THE AUTHOR

...view details