తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసు భద్రతను తిరస్కరించిన ఏపీ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.. కారణం ఏమిటి? - భద్రతను తిరస్కరించిన కాపు రామచంద్రా రెడ్డి

Government Whip Ramachandra Reddy: ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.. భద్రతా అంశం చర్చాంశనీయంగా మారింది. ప్రభుత్వ విప్‌గా ఉన్న రామచంద్రారెడ్డికి ఒక హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుల్ కలిపి నలుగురు గన్‌మెన్లు ఉన్నారు. అయితే.. ఎమ్మెల్యే తనకు గన్​మెన్లు వద్దని చెప్పినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Ramachandra Reddy
Ramachandra Reddy

By

Published : Dec 18, 2022, 10:43 PM IST

Government Whip Ramachandra Reddy: ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.. భద్రతా సిబ్బందిని తిరస్కరించారు. ప్రభుత్వ విప్‌గా ఉన్న రామచంద్రారెడ్డికి.. ఒక హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుల్ కలిపి నలుగురు గన్‌మెన్లు ఉన్నారు. అయితే ఎమ్మెల్యే తనకు గన్​మెన్లు వద్దని పంపించారు. రాయదుర్గంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలోనూ.. గన్‌మెన్లు లేకుండానే పాల్గొన్నారు.

విదేశాల్లో ఉన్నత చదువులకు రామచంద్రారెడ్డి వెళుతున్నట్లు ప్రచారం వినపించగా.. ఈ మేరకు కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు ఆయన్ను కలిసి చర్చలు జరిపారు. తాను ఉన్నత విద్యను అభ్యసిస్తున్నందున గన్ మెన్లు ఉండటం ఇబ్బందిగా ఉంటుందని.. సంక్రాంతి అనంతరం మళ్లీ గన్​మెన్లు నియమించమని రామచంద్రారెడ్డి పోలీసు అధికారులకు సూచించినట్లు తెలిసింది. కాపు వ్యూహం ప్రజా ప్రతినిధులకు.. అధికారులకు అంతుచిక్కడం లేదు. గన్​మెన్​లను ఎందుకు ఉపసంహరించారో ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details