తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళా సంఘాలపై ప్రభుత్వ నిర్బంధకాండ! - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో మహిళా సంఘాలపై ప్రభుత్వ నిర్బంధకాండను వ్యతిరేకిస్తున్నట్లు ప్రగతి శీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) అధ్యక్షురాలు సంధ్య అన్నారు. సంఘటిత మహిళా ఉద్యమ స్వరాలపై నిర్బంధాలు, నిషేధాలను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మహిళా సంఘాలపై ప్రభుత్వ నిర్బంధ ఖండ!

By

Published : Nov 24, 2019, 9:36 PM IST

రాష్ట్రంలో మహిళా సంఘాలపై జరుగుతున్న ప్రభుత్వ నిర్బంధ కాండను వ్యతిరేకిస్తున్నట్లు ప్రగతి శీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) అధ్యక్షురాలు సంధ్య తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలకు నిరసనగా అక్టోబర్ 3న ధర్నా నిర్వహించిన ప్రజా సంఘాల నాయకులపై, మహిళా సంఘ నాయకులపై ఉఫా చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం దారుణమన్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న చైతన్య మహిళ సంఘ కార్యకర్తలు అనిత, అన్నపూర్ణ, స్వప్న, దేవేంద్రలపై కూడా ఉఫా చట్టాన్ని మోపారని పేర్కొన్నారు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘ నాయకులపై, కార్యకర్తలపై నమోదు చేసిన ఉఫా చట్టాన్ని ఎత్తివేయాలని, లేని పక్షంలో మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మహిళా సంఘాలపై ప్రభుత్వ నిర్బంధ ఖండ!

ఇదీ చూడండి : 'కేసీఆర్​ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'

ABOUT THE AUTHOR

...view details