హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 23 అక్రమ కట్టడాలను టౌన్‌ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. రెండు రోజుల నుంచి మొత్తం 44 నిర్మాణాలను తొలగించారు. ఎల్బీనగర్ జోన్ పరిధిలో 6, శేరిలింగంపల్లి జోన్లో 5, సికింద్రాబాద్‌లో 5, కూకట్‌పల్లిలో 3, ఖైరతాబాద్‌లో 3, చార్మినార్‌లో ఓ భవనాన్ని కూల్చేసినట్టు అధికారులు వెల్లడించారు. అనుమతి పొందిన మేరకే కట్టడాలు చేపట్టాలని, నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తే.. ముందస్తు నోటీసులు లేకుండా కూల్చివేస్తామని హెచ్చరించారు.
కూల్చేస్తాం జాగ్రత్త!
అక్రమ కట్టడాలను తొలగించే పనిలో జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు తలమునకలయ్యారు. అనుమతులు లేకుండా... నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే నేలమట్టం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు...!
కొనసాగుతున్న కూల్చివేతల పర్వం