తెలంగాణ

telangana

ETV Bharat / state

సక్సెస్‌ఫుల్‌గా ముగిసిన ఫార్ములా ఈ-రేస్‌.. విజేతలుగా నిలిచింది వీరే

Formula E Race Ended in Hyderabad: హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఫార్ములా ఈ-రేస్‌ సీసన్‌ 9లో జాన్‌ ఎరిక్‌ వర్నే విజేతగా నిలిచారు. ఫార్ములా ఈ-రేసుకు సంబంధించి నెల నుంచే మెుదలైన హడావిడి నేటితో ముగిసింది. పూర్తిగా ఒకరోజు పాటు సాగిన సీసన్‌ 9 రేసును వీక్షించేందుకు సినీ తారలు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు తరలివచ్చారు. పూర్తిగా ఈవీ బాటలో నడిచిన ఫార్ములా ఈ విజయవంతంగా ముగిసింది.

Formula E Racing Ended in Hyderabad
Formula E Racing Ended in Hyderabad

By

Published : Feb 11, 2023, 7:14 PM IST

Updated : Feb 12, 2023, 6:37 AM IST

Formula E Race Ended in Hyderabad: అభిమానులందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఫార్ములా ఈ-రేసింగ్‌ విజయవంతంగా ముగిసింది. మెుదటి రోజు జరిగిన ప్రాక్టీస్‌ రేసులో త్రుటిలో ప్రమాదం తప్పినప్పటికీ.. రెండో రోజు రేసులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ప్రీ ప్రాక్టీస్‌ రేసు-2తో రెండో రోజు రేసింగ్‌ మెుదలవ్వగా.. అనంతరం క్వాలిఫైంగ్‌ రేసుతో రేసర్లు అభిమానులను ఆకట్టుకున్నారు.

మొట్టమొదటిసారి హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన రేసింగ్‌ సర్క్యూట్‌ వద్ద జరిగిన ఫార్ములా రేసును చూసేందుకు సినీతారలు, రాజకీయ నాయకులు, అభిమానులు తరలివచ్చారు. క్వాలిఫైంగ్‌ రేస్‌ వరకు టాప్‌లో నిలిచిన జాగ్వార్‌ రేసింగ్‌ టీమ్‌ డ్రైవర్‌ సామ్‌ బర్డ్‌ క్వాలిఫైంగ్‌ రేసు పూర్తి అయ్యేసరికి వెనుకబడిపోయారు. క్వాలిఫైంగ్‌ రేసు అనంతరం జరిగిన ఫైనల్‌ రేసులో సామ్‌ బర్డ్‌ వెనకబడటంతో ఫైనల్‌ 10 ల్యాప్‌లలో ముందంజలో నిలుస్తూ ఫార్ములా ఈ సీజన్‌-9 విజేతగా జా ఎరిక్‌ వా నిలిచారు.

మొత్తం రేసు పూర్తి అయ్యేసరికి 25 పాయింట్లతో జా ఎరిక్‌ వా మొదటి స్థానంలో నిలవగా.. 18 పాయింట్లతో నిక్ క్యాసిడి రెండో స్థానంలో నిలిచారు. ఇక 15 పాయింట్లతో ఆంటోనియో ద కోస్తా మూడో స్థానంలో నిలిచారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన రేసర్లకు మంత్రి కేటీఆర్‌ ట్రోఫీలు అందజేశారు. ఆఖరి 10 ల్యాప్‌లకు అభిమానులు కేరింతలు కొడుతూ తమ అభిమాన రేసర్లకు మద్దతు ఇచ్చారు. మొదటి స్థానంలో నిలిచిన జా ఎరిక్‌ వా హర్షం వ్యక్తం చేశారు. ఎక్కడా తప్పులు చేయకుండా రేసు పూర్తి చేసినందుకు ఆనందంగా ఉందని తెలిపారు.

ఫార్ములా ఈ-రేస్‌ విజేతలు

ప్రేక్షకుల కోసం ఇంటరాక్టివ్‌ సెషన్..: అంతకుముందు ప్రీ ప్రాక్టీస్ రేస్‌ అనంతరం రేస్ డ్రైవర్లను కలిసి ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు ప్రేక్షకుల కోసం ఇంటరాక్టివ్ సెషన్​ను ఏర్పాటు చేశారు. తమ అభిమాన డ్రైవర్లతో స్వీయచిత్రాలు, ఆటోగ్రాఫ్‌ల కోసం అభిమానులు వందల సంఖ్యలో బారులు తీరారు. అనంతరం నగరంలో తొలిసారి జరిగిన అంతర్జాతీయ ఫార్ములా రేసును చూసి ఆనందించారు.

కట్టుదిట్టమైన భద్రతా చర్యలు..: ఈ రోజు ఉదయం 8 గంటలకే ప్రీ ప్రాక్టీస్‌, తర్వాత క్వాలిఫయింగ్‌.. అనంతరం 3 గంటల తర్వాత ప్రధాన రేస్‌కు డ్రైవర్లు రంగంలోకి దిగారు. దాదాపు గంటన్నర పాటు ఈ రేస్‌ సాగింది. అంతర్జాతీయ పోటీలు కావడంతో భద్రతా పరంగా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. గ్యాలరీల్లోకి ప్రేక్షకులను విడిచిపెట్టే ముందు క్షుణ్నంగా తనిఖీలు చేసి ఆ తర్వాత లోనికి పంపించారు.

ఇవీ చూడండి..

హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేసింగ్‌.. తరలివచ్చిన సినీ, క్రీడా ప్రముఖులు

ఘనంగా రెండో రోజు ఫార్ములా-ఈ రేసింగ్.. సందడి చేసిన ప్రేక్షకులు

Last Updated : Feb 12, 2023, 6:37 AM IST

ABOUT THE AUTHOR

...view details